Sunday, 8 November 2015

దీక్ష

దీక్ష....
దీక్ష అంటే ఏమిటి? ఓక రోజు దీక్ష, మూడు రోజుల దీక్ష, ఐదు రోజుల దీక్ష, తొమ్మిది రోజుల దీక్ష,  పక్షం రోజుల దీక్ష, ఇరువది ఒక్క రోజు దీక్ష, మండల (40) రోజుల దీక్ష, మూడు నెలల దీక్ష, నాలుగు నెలల దీక్ష.....ఇలా పోతూ వుంటుంది....
దీక్ష అంటే మాసిన గడ్డంతో కనిపిస్తారు అందరూ....అంటే దీక్షలో వుంటే గడ్డం గీసుకోకూడదు, తల చమురు పెట్టుకోకూడదు, తల దువ్వుకోకూడదు, అద్దం చూడకూడదు, పరుపుల మీద పడుకోకూడదు, పరుపులు తాకకూడదు, సినిమాలు, సీరియల్స్ చూడకూడదు, చెత్త సాహిత్యం చదవకూడదు....రజో, తమోగుణములను ప్రేరేపించే ఏ పనులూ చేయకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి, కలలో కూడా కామ కోరికలు కలగకూడదు, మనసును రెచ్చగొట్టే దృశ్యములను, మాటలను, పదార్ధములను కనకూడదు, వినకూడదు, రుచి చూడకూడదు...తాంబూలం సేవించకూడదు.... ఎర్రగడ్డ, తెల్లగడ్డ, మసాలా దినుసులు వాడకూడదు....పులుపు పదార్ధములు సేవించకూడదు..వేడి చేసే పదార్ధములు తినకూడదు.....ఆహారంలో సాత్విక పదార్ధములు మాత్రమే వుండాలి. భగవంతుడికి నివేదన చేసి తినాలి....బయట పదార్ధములు తినకూడదు....వీలైతే అమ్మ చేతి వంటే తినాలి....కోరికలతో వున్న వాళ్లు చేసిన వంట తినకూడదు....ఓంటిపూట మాత్రమే తినాలి, కడుపు నిండా తినకూడదు....రుచికరమైన పదార్దములు తినకూడదు....ఉప్పు కారం లేని పదార్దములను మాత్రమే తినాలి....వడ్డించే వాళ్లు పవిత్రమైన మనస్సుతో వడ్డించాలి....అంటు తగలకూడదు ....ఆడవాళ్లు బహిష్టు అయిన ఇంట్లో వుండకూడదు...మూడు సార్లు తలకు స్నానం చేయవలయును....నేల మీద చాప వేసుకొని దిండు లేకుండా పడుకోవలయును....భగవంతుడికి అతి సమీపములో ఎప్పుడూ వుండవలయును...మనసులో భగవంతుడి నామం, జపం చేస్తూ వుండవలయును....త్రికరణ శుద్దిగా మనసును నిర్మలంగా వుంచుకొని, కామ క్రోధములను జయించి భగవత్ ఆరాధన చేస్తూ వుండవలయును.....దేహమును, మనసును అగ్ని సమానముగా పవిత్రముగా వుంచుకొనవలయును.....ఊరి బయటి చెరువును దాటి వెళ్లకూడదు....ఇతరుల ఇళ్ళకు వెళ్లకూడదు ....ఎక్కువ సేపు మౌనం పాటించవలయును....జప మాల ధరించవలయును....స్త్రీలతో హాస్య ఛలోక్తులు మాటలాడకూడదు.....ఎవ్వరినీ కవ్వించకూడదు.....వాదనలు, తగువులు, అబద్ధములు ఆడకూడదు, సత్యమునే చెప్పవలయును.....తోలు వస్తువులు ధరించకూడదు...అతి నిద్ర పోకూడదు....మనసు చంచలం కాకూడదు....పవిత్రమైన వస్తువులను దగ్గరగా వుంచుకోవలయును.....గురువులకు, తల్లిదండ్రులకు, గుడికి,  నదికి దగ్గరగా వుండవలయును.....చన్నీటి స్నానము చేయవలయును.....విభూతి రేఖలు ధరించి , దీక్షా వస్త్రములు ధరించి, ఆశ్రమ వాసునిగా, అతి సాధారణంగా కనిపించవలయును....

ఈ దీక్షలన్నీ నేను పాటించాను, అందుకే పొల్లుపోకుండా వ్రాయగలిగాను....స్వయంగా ఆచరించినది....పుస్కములో చూసి వ్రాసినది కాదు....శ్రీవిద్యాదీక్ష, శ్రీవిద్యోపాసన అంటే ఇదే.....అంత కఠినంగా వుంటాయి....చేసి సాధించాను గనుకే పాదుకాంత పూర్ణదీక్ష వచ్చినది, ఈ మాటలు గర్వంగా చెప్పగలుగుతున్నాను ..ఈనాడు దీక్ష అంటే తెలియకుండా గడ్డం పెంచుకొని, మెడలో ఒక మాల వేసుకొని చెయ్యకూడని అన్ని పనులు చేస్తూ తిరుగుతున్నారు....అందుకే బాధ వేసి ఇలా వ్రాసాను...

.....భాస్కరానంద నాథ/08-11-2015

No comments:

Post a Comment